పెన్షన్ల పంపిణీలో రాజకీయ జోక్యంపై ఎన్నికల సంఘానికి వైసీపీ ఫిర్యాదు

రిపోర్టర్: అశోక్ స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల వేళ పెన్షన్ల పంపిణీ వ్యవహారంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ప్రక్రియను అడ్డుపెట్టుకుని టీడీపీ నేతలు ఓటర్లను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. రాజకీయ నాయకుల జోక్యం లేకుండా కేవలం ప్రభుత్వ ఉద్యోగుల ఆధ్వర్యంలోనే పంపిణీ జరిగేలా తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారులను వైసీపీ కోరినట్లు ఆ పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి.