చెస్ పోటీల్లో ఏడు సంవత్సరాల విదుర్ అద్భుత ప్రదర్శన

రిపోర్టర్: రామానుజపల్లి హరిబాబు స్థలం: తిరుపతి అర్బన్

తిరుపతిలో నిర్వహించిన ఓపెన్ చెస్ టోర్నమెంట్లో ఏడు సంవత్సరాల బాలుడు అనిమిని విదుర్ అండర్-15 విభాగంలో కేటగిరీ-2లో 12వ స్థానంలో నిలిచి మెరిట్ సాధించారు. చిన్న వయసులోనే పెద్దలతో పోటీ పడుతూ ప్రతిభ కనబరచడంపై శాప్ చైర్మన్ రవి నాయుడు బాలుడిని ప్రత్యేకంగా అభినందించారు. విదుర్ ఇదే స్ఫూర్తితో నిరంతరం సాధన చేసి భవిష్యత్తులో రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు.