గుడిమల్కాపురంలో ఘనంగా ఈదమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: సంస్థాన్ నారాయణపూర్
సంస్థాన్ నారాయణపూర్ మండలం గుడిమల్కాపురం గ్రామంలో శ్రీశ్రీశ్రీ ఈదమ్మ దేవత విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ కార్యక్రమానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అమ్మవారి ఆశీస్సులతో గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. భక్తిభావంతో విగ్రహ ప్రతిష్ఠను నిర్వహించిన గ్రామస్తులను ఆయన అభినందించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు, గ్రామ పెద్దలు జాజుల శ్రీనివాస్ గౌడ్‌ను ఘనంగా సన్మానించారు.