స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా ఆల్విన్ కాలనీలో శ్రమదానం

రిపోర్టర్: saikiran స్థలం: శేరిలింగంపల్లి

స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా హఫీజ్పేట్ డివిజన్ ఆల్విన్ కాలనీ పార్కులో సామూహిక స్వచ్ఛంద శ్రమదానం నిర్వహించారు. డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్, ఘన వ్యర్థాల నిర్వహణ సిబ్బంది, స్థానిక రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొని పార్కు ప్రాంగణాన్ని శుభ్రం చేశారు. పరిసరాల పరిశుభ్రత అందరి ఉమ్మడి బాధ్యతని, బహిరంగ ప్రదేశాలను చెత్త రహితంగా ఉంచాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.