అర్హులందరికీ సామాజిక పింఛన్లు అందించాలని కలెక్టర్ ఆదేశం

రిపోర్టర్: భాస్కర్ స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరితో సామాజిక పింఛను కోసం దరఖాస్తు చేయించాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విజయనగరం స్వర్ణ జమ్ము సచివాలయంలో పింఛన్ల దరఖాస్తు ప్రక్రియను పరిశీలించిన ఆయన, ఈ నెల 18వ తేదీలోగా దరఖాస్తులు పూర్తి చేసి, 21లోగా పరిశీలన ప్రక్రియ ముగించాలని స్పష్టం చేశారు.