అనారోగ్యం కారణంగా కర్ణాటకలో అమిత్ షా అధికారిక కార్యక్రమం రద్దు
రిపోర్టర్: సతీష్
స్థలం: కర్ణాటక
కర్ణాటకలో పర్యటిస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం అనారోగ్యం కారణంగా హుబ్బళ్లిలో జరగాల్సిన అధికారిక కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. వైద్యుల సూచన మేరకు ఆయన బస చేసిన హోటల్లోనే విశ్రాంతి తీసుకుంటున్నట్లు కేఎల్ఈ సొసైటీ ఛైర్మన్ ప్రభాకర్ కోరే తెలిపారు. ఆయన ప్రారంభించాల్సిన కేఎల్ఈ హాస్పిటల్ మరియు మెడికల్ రీసెర్చ్ సెంటర్ భవనాలను కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, మంత్రి శరణ్ ప్రకాశ్ పాటిల్, మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై ప్రారంభించారు.