మియాపూర్లో భక్తిశ్రద్ధలతో ముగిసిన వినాయక నిమజ్జన వేడుకలు

రిపోర్టర్: saikiran స్థలం: శేరిలింగంపల్లి

మియాపూర్ పరిధిలోని దత్త సాయి కాలనీ, నడిగడ్డ తండా, ఆరోబిందో కాలనీలలో వినాయక చవితి ముగింపు వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ ఇంచార్జ్ వి. జగదీశ్వర్ గౌడ్, ట్రస్ట్ చైర్మన్ యలమంచి ఉదయ్ కిరణ్ పాల్గొని ప్రత్యేక పూజలు, అన్నదానం నిర్వహించారు. కమిటీ సభ్యులు వీరిని శాలువాలతో సత్కరించగా, స్థానిక ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.