బెల్లంపల్లిలో కట్ట సత్యనారాయణకు స్వర్ణకారుల ఘన నివాళి
రిపోర్టర్: ramesh chitty
స్థలం: బెల్లంపల్లి
అఖిల భారత స్వర్ణకార సంఘం ఉపాధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘ గౌరవ అధ్యక్షుడు కట్ట సత్యనారాయణ మృతి పట్ల బెల్లంపల్లి స్వర్ణకార సంఘం సంతాపం వ్యక్తం చేసింది. శనివారం పట్టణంలోని సంఘ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సంఘ ప్రతినిధులు సత్యనారాయణ సేవలను స్మరించుకుంటూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ మనోహర చారి, రంగు ఉపేంద్ర చారి, గడ్డం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.