రూ.9 కోట్ల బ్రిడ్జి నిధులపై కాంగ్రెస్ నాయకులను నిలదీసిన అరవింద్ ధర్మపురి

రిపోర్టర్: విజయ్ స్థలం: నిజామాబాద్

నిజామాబాద్ జిల్లాలో రెండు సంవత్సరాలు గడిచినా తొమ్మిది కోట్ల రూపాయల అదనపు ఆర్థిక భారం సమస్య ఇంకా పరిష్కారం కాలేదని ఎంపీ అర్వింద్ ధర్మపురి మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు కనీసం తమ బెంజ్ కార్ల కోసమైనా వెంటనే వంతెన నిర్మాణ పనులను పూర్తి చేయాలని ఆయన ఘాటుగా డిమాండ్ చేశారు. పుట్టిన జిల్లా అభివృద్ధిపై నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ కాంగ్రెస్ పాలన తీరును తీవ్రంగా ఆక్షేపిస్తూ ఆయన సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు.