మండల ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న ఆర్ట్ టీచర్ రాములు
రిపోర్టర్: KOLA MAHESH
స్థలం: నారాయణపురం
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆర్ట్ టీచర్ గా విధులు నిర్వహిస్తున్న సంగిశెట్టి రాములు మండల్ బెస్ట్ టీచర్ - 2026 అవార్డును అందుకున్నారు. గురువారం వలిగొండ మండల కేంద్రంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈ అవార్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జి జలంధర్ రెడ్డి, ఎంఈఓ ఎస్ భాస్కర్, స్థానిక సర్పంచి కే వెంకట పాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.