హైదరాబాద్లో గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్: అవగాహనే ప్రాణాలను కాపాడుతుందని స్పష్టం చేసిన మంత్రి

రిపోర్టర్: వెంకట్ స్థలం: పెద్దపల్లి

హైదరాబాద్లో నిర్వహించిన తొమ్మిదో ఎడిషన్ గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్ కార్యక్రమంలో దుద్దిళ్ల శ్రీధర్ బాబు - మంత్రి, మంథని ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. క్యాన్సర్ వ్యాధి పట్ల సరైన అవగాహన, ప్రాథమిక దశలోనే గుర్తింపు ద్వారా ఎంతోమంది ప్రాణాలను కాపాడడం సాధ్యమవుతుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ప్రజలు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని పిలుపునిచ్చిన ఆయన, ఇటువంటి వినూత్న కార్యక్రమాలు ఆరోగ్య స్పృహను పెంపొందించడంలో ఎంతో కీలక పాత్ర పోషిస్తాయని కొనియాడారు.