అనంతపురంలో సూపర్ ఎల్నినో బీభత్సం: ఎండిపోతున్న వేల ఎకరాల పంటలు
రిపోర్టర్: రాజేష్
స్థలం: అనంతపురం
సూపర్ ఎల్నినో ప్రభావంతో ఉమ్మడి అనంతపురం జిల్లాలో వర్షాలు లేక పంటలు పూర్తిగా ఎండిపోతున్నాయి. 62 శాతం వర్షపాత లోటుతో కంది, వేరుశనగ, టమాటా పంటలు దెబ్బతిన్నాయి. సుమారు పదివేల ఎకరాల్లో రైతులు పంటలను తొలగిస్తున్నారు. లక్షల అప్పులు చేసి వేసిన బోర్లు ఎండిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని అన్నదాతలు వేడుకుంటున్నారు.