పెదబయలు జడ్పీటీసీ అభ్యర్థిగా వంతాల శాంతిని ఖరారు చేసిన పార్టీ

రిపోర్టర్: SINDERI KAMESH స్థలం: పెదబయలు

పెదబయలు మండల జడ్పీటీసీ స్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వంతాల శాంతిని ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ ఎంపిక పట్ల స్థానిక నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ విజయానికి అందరూ ఐక్యంగా కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.