కుండపోత వర్షంతో ఒక్కసారిగా చల్లబడిన పుత్తూరు మండల వాతావరణం
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: పుత్తూరు
పుత్తూరు మండలం కె బి ఆర్ పురంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మధ్యాహ్నం వరకు మండిపడిన ఎండలు, ఉక్కపోతతో ఇబ్బంది పడిన ప్రజలకు ఆకస్మికంగా కురిసిన భారీ వర్షం ఎంతో ఉపశమనాన్నిచ్చింది. చల్లటి ఈదురుగాలులు వీయడంతో ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. వేడి నుంచి ఉపశమనం లభించడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.