జర్మనీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీధులెక్కిన వేలాది మంది ప్రజలు
రిపోర్టర్: మహేష్
స్థలం: World
జర్మనీలో ప్రభుత్వ విధానాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. జీవన వ్యయం, నివాస వసతి, ఉపాధి మరియు వలసల విధానాలను నిరసిస్తూ వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళన చేపట్టారు. మ్యూనిచ్‌లో 'ఈ ప్రభుత్వం దిగిపోవాలి' అనే నినాదాలతో ప్రదర్శనలు నిర్వహించారు. సాక్సోనీ-అన్హాట్‌లో మితవాద పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో జర్మనీ రాజకీయాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.