మున్సిపాలిటీ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత
రిపోర్టర్: నరేష్
స్థలం: రంగారెడ్డి
ఆమనగల్లు మున్సిపాలిటీ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. శనివారం ఆయన మున్సిపాలిటీ పరిధిలోని ఐదు వార్డుల్లో పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించారు. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని, సీసీ రోడ్డు నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పత్య నాయక్, వైస్ చైర్మన్ గీత, కమిషనర్ రాఘవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.