చిరంజీవి 'కాకా' సినిమాపై థమన్ క్రేజీ అప్‌డేట్!

రిపోర్టర్: కిరణ్ స్థలం: తెలంగాణ

మెగాస్టార్ చిరంజీవి, బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘కాకా’ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తాజాగా సెట్స్ నుంచి చిరంజీవితో దిగిన ఫొటోను పంచుకున్న సంగీత దర్శకుడు థమన్, తన కెరీర్‌లోనే అత్యుత్తమమైన సంగీతాన్ని అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. మెగాస్టార్ స్క్రీన్ ప్రెజెన్స్‌కు తగ్గట్టుగా అదిరిపోయే ట్యూన్స్ సిద్ధం చేస్తున్నట్లు హామీ ఇవ్వడంతో అభిమానుల్లో అంచనాలు తారాస్థాయికి చేరాయి.