వర్ధన్నపేట పాక్స్ నూతన చైర్మన్గా రాజిరెడ్డి బాధ్యతలు స్వీకరణ
రిపోర్టర్: BHANUCHANDER DOMMATI
స్థలం: వర్ధన్నపేట
వర్ధన్నపేట ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన చైర్మన్గా అభీడి రాజిరెడ్డి గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. సీఈఓ వెంకటయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాలకవర్గ డైరెక్టర్లతో కలిసి ఆయన బాధ్యతలను చేపట్టారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన ప్రజాప్రతినిధులకు, సహకార సంఘ డైరెక్టర్లకు, రైతులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.