ఉత్తరప్రదేశ్ తొలి వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభానికి సర్వం సిద్ధం

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: Varanasi / Delhi

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైనట్లు కేంద్ర రైల్వేశాఖ వెల్లడించింది. వారణాసి నుంచి ఢిల్లీ మధ్య నడవనున్న ఈ అత్యాధునిక వందే భారత్ స్లీపర్ రైలును రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్వయంగా పరిశీలించారు. తొలి ప్రయాణానికి ముందు రైలులోని ప్రయాణికుల వసతులు, భద్రతా ప్రమాణాలు మరియు సాంకేతిక ఏర్పాట్లను ఆయన క్షుణ్ణంగా తనిఖీ చేశారు.