పల్నాడు ఎత్తిపోతల జలపాతంలో సాహస క్రీడలు ప్రారంభం

రిపోర్టర్: సురేష్ స్థలం: పల్నాడు

పల్నాడు జిల్లాలోని ప్రసిద్ధ ఎత్తిపోతల జలపాతం వద్ద పర్యాటకులను ఆకర్షించేందుకు సుమారు రూ.రెండు కోట్ల వ్యయంతో జిప్‌లైన్, జిప్ సైక్లింగ్ వంటి సాహస క్రీడలను ఏర్పాటు చేశారు. ఎత్తైన కొండల మధ్య జలపాతంపై సాహసాలు చేస్తూ యువత సరికొత్త థ్రిల్లింగ్ అనుభూతిని పొందుతున్నారు. ఈ అడ్వెంచర్ రైడ్స్ అందుబాటులోకి రావడంతో పర్యాటకుల తాకిడి విపరీతంగా పెరిగింది.