రామలింగాపురంలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు: మానసాదేవికి భక్తుల పూజలు
రిపోర్టర్: రాము
స్థలం: చీపురుపల్లి
చీపురుపల్లి మండలంలోని రామలింగాపురంలో మానసాదేవి ఆలయంలో ఆదివారం శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు. తొలిరోజున అమ్మవారికి పసుపు, కుంకుమ మరియు పంచామృతాభిషేకాలు ఘనంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. అనంతరం అమ్మవారిని బాలా త్రిపురసుందరీ దేవిగా అలంకరించి భక్తులకు దివ్య దర్శనం కల్పించగా, వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు అమ్మవారికి ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నారు. సామూహిక కుంకుమార్చన పూజల్లో మహిళలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.