కంపెనీలో వింత నిబంధన: రెండో రోజే ఉద్యోగం వదిలేసిన ఉద్యోగి
రిపోర్టర్: రమేష్
స్థలం: హైదరాబాద్
భోజన విరామ వేళపై హెచ్ఆర్ తో వివాదం తలెత్తడంతో చేరిన రెండు రోజులకే ఓ ఉద్యోగి ఉద్యోగం మానేసినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్ అయింది. క్యాంటీన్ లో రద్దీ కారణంగా భోజనానికి వెళ్ళి కొద్ది నిమిషాలు ఆలస్యంగా రావడంతో హెచ్ఆర్ మందలించారని, విరామ వేళ మార్చాలన్న విజ్ఞప్తిని తిరస్కరించడంతో ఉద్యోగి వెంటనే రాజీనామా చేసి బయటకు వెళ్ళిపోయారని ఎక్స్ యూజర్ వెల్లడించారు.