స్పోర్ట్స్ కోటా ఉపాధ్యాయులపై దాడిని ఖండించిన క్రీడాసంఘాలు

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: విజయవాడ

విజయవాడలోని శాప్ కార్యాలయం వద్ద స్పోర్ట్స్ కోటా ఉపాధ్యాయులపై జరిగిన దాడిని పలు క్రీడాసంఘాలు తీవ్రంగా ఖండించాయి. రాజకీయ లబ్ధి కోసం క్రీడాసంఘాలపై నేతలు బురదజల్లడం మానుకోవాలని రాష్ట్ర ఆర్చరీ సంఘం ఛైర్మన్ చెరుకూరి సత్యనారాయణ, ఒలింపిక్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి కేపీ రావు, తైక్వాండో అసోసియేషన్ ఆలిండియా ఉపాధ్యక్షుడు హర్షవర్ధన్ ప్రసాద్ హెచ్చరించారు. అభ్యంతరాలుంటే నిబంధనల ప్రకారం ఫిర్యాదు చేయాలని కానీ, క్రీడాకారులను అవమానించడం భవిష్య క్రీడారంగానికి మంచిది కాదని హితవు పలికారు.