అమెరికాలో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు విరాళంగా అందించిన తానా
రిపోర్టర్: వెంకట్
స్థలం: అమెరికా
ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా క్యాపిటల్ ఏరియా టీమ్ ఆధ్వర్యంలో మేరీల్యాండ్‌లోని విండ్‌సర్ మిల్‌లో ఉన్న ది ఎక్స్ఛేంజరీ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆఫ్ బాల్టిమోర్ కౌంటీ పబ్లిక్ స్కూల్స్‌కు స్కూల్ బ్యాగ్‌లు మరియు ఇతర వస్తువులను విరాళంగా అందించారు. ఈ కార్యక్రమంలో తానా అధ్యక్షుడు డాక్టర్ నరేన్ కొడాలి, బోర్డ్ డైరెక్టర్ అనిల్ ఉప్పలపాటి, కమ్యూనిటీ సర్వీసెస్ కోఆర్డినేటర్ సాయి బొల్లినేని, బాల్టిమోర్ సిటీ కోఆర్డినేటర్ ఉమాకాంత్ మరియు రీజినల్ రిప్రజెంటేటివ్ సుధీర్ కొమ్మి తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.