అరుదైన జంట నక్షత్రాలను గుర్తించిన ఖగోళ శాస్త్రవేత్తలు

రిపోర్టర్: అశోక్ స్థలం: అంతరిక్ష

భారతీయ ఖగోళ శాస్త్రవేత్తల నేతృత్వంలోని అంతర్జాతీయ బృందం కేవలం 374 సెకన్లలోనే ఒకదాని చుట్టూ ఒకటి పరిభ్రమిస్తున్న రెండు వైట్ డ్వార్ఫ్ నక్షత్రాలను గుర్తించింది. ఇఎస్ఆర్ఎస్యూ జే0608గా పిలిచే ఈ జంట నక్షత్రాల కక్ష్య సాధారణ కన్నా వేగంగా కుంచించుకుపోతున్నట్లు పరిశోధకులు తెలిపారు. నాసా, ఐరోపా అంతరిక్ష సంస్థల టెలిస్కోప్ల ద్వారా ఈ కీలక విషయాన్ని కనుగొన్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు.