స్థానిక ఎన్నికల్లో తప్పుడు ప్రచారాలు నమ్మవద్దు: యువతకు పైనేని మురళి పిలుపు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: శ్రీరంగరాజపురం
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామీణ ప్రజలను తప్పుదోవ పట్టించే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని శ్రీరంగరాజపురం నాయకుడు పైనేని మురళి విజ్ఞప్తి చేశారు. అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థులను గెలిపిస్తేనే ఊరి అభివృద్ధి సాధ్యమవుతుందనేది కేవలం అపోహ మాత్రమేనని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, నిధులు యథావిధిగా అందుతాయని, ఈ విషయాన్ని ఓటర్లకు వివరించి చైతన్యపరచడంలో యువత ముందుండాలని ఆయన పిలుపునిచ్చారు. స్థానిక ఎన్నికలపై యువత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.