ఎమ్మెల్యే హామీతో వెనక్కితగ్గిన కమలనాథులు: ఆమనగల్లులో వాయిదా పడిన బీజేపీ ధర్నా
రిపోర్టర్: Mohammad Abdul Azeem
స్థలం: ఆమనగల్
ఆమనగల్లు మున్సిపాలిటీలో చిరు వ్యాపారుల సమస్యలపై అక్టోబర్ 5న నిర్వహించ తలపెట్టిన బీజేపీ ధర్నా వాయిదా పడింది. స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షులు కర్నాటి విక్రమ్ రెడ్డి స్పష్టం చేశారు.