కుక్కునూరు మండ గోదావరి నదిలో బాలుడు గల్లంతు

రిపోర్టర్: రాజేష్ స్థలం: ఏలూరు

కుక్కునూరు మండలం పెదరావిగూడెం పుష్కర్ ఘాట్ వద్ద గోదావరి నదిలో స్నానం చేస్తుండగా అల్లిగూడ గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్థి బూరం పాల్రాజ్ ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. గురువారం మధ్యాహ్నం స్నేహితులతో కలిసి శివాలయానికి వెళ్లిన పాల్రాజ్ నదిలో దిగి నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో మునిగిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహకారంతో గాలింపు చర్యలు చేపట్టారు.