భక్తిశ్రద్ధలతో సురసముద్రం చెరువులో సాగిన గణేశుని నిమజ్జనం

రిపోర్టర్: Abdul Azeem స్థలం: ఆమనగల్

రంగారెడ్డి జిల్లా ఆమనగల్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఐదు రోజుల పాటు పూజలందుకున్న వినాయక విగ్రహాన్ని శుక్రవారం సాయంత్రం ఘనంగా సురసముద్రం చెరువులో నిమజ్జనం చేశారు. ఈ వేడుకల్లో ఆమనగల్ సీనియర్ సివిల్ జడ్జ్ నారం అరుణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా లడ్డు వేలం పాట నిర్వహించగా, బార్ అసోసియేషన్ అధ్యక్షులు అండేకార్ యాదిలాల్ రూ.16,316లకు పెద్ద లడ్డును దక్కించుకోగా, మరో చిన్న లడ్డును న్యాయవాది ప్రభు నాయక్ రూ.4,116లకు దక్కించుకున్నారు. విజయవంతంగా ముగిసిన ఈ వేడుకల్లో న్యాయవాదులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిభావాన్ని చాటుకున్నారు.