నాకు ఇష్టమైన కెప్టెన్లు వారేనంటూ క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ వెల్లడి
రిపోర్టర్: అశోక్
స్థలం: హైదరాబాద్
భారత క్రికెట్ జట్టుకు నాయకత్వం వహించడం గొప్ప గౌరవమని, అయితే తనకు నచ్చినట్లుగా జట్టును ఎంచుకునే స్వేచ్ఛ ఎప్పుడూ ఉండేది కాదని క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ వెల్లడించారు. సోషల్ మీడియా వేదికగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. సౌరవ్ గంగూలీ, ఎంఎస్ ధోనీ తనకెటీ ఇష్టమైన కెప్టెన్లని ఆయన స్పష్టం చేశారు. తొంభై దశకంలో భారత క్రికెట్ అత్యంత క్లిష్టమైన దశను ఎదుర్కొందని సచిన్ గుర్తుచేశారు.