త్రాగునీరు అందక అల్లాడుతున్న బొబ్బిలి పట్టణ ప్రజల ఆవేదన

రిపోర్టర్: GANESH BBL స్థలం: బొబ్బిలి

విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలో ఆర్నబ్ తుఫాను కారణంగా నాలుగు రోజులుగా త్రాగునీరు సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మువ్వల శ్రీనివాసరావు ప్రస్తావిస్తూ, అధికారుల నిర్లక్ష్యంపై ఆవేదన వ్యక్తం చేశారు. పురపాలక సంఘం అధికారులు తక్షణమే స్పందించి యుద్ధ ప్రాతిపదికన తాగునీరు అందించాలని ఆయన డిమాండ్ చేశారు.