రైతులకు కలెక్టర్ పిలుపు: వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి

రిపోర్టర్: గోపి స్థలం: ఖమ్మం

ఎల్నినో ప్రభావంతో వర్షభావ పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా రైతులు అధిక నీరు అవసరమయ్యే వరి పంటకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ పిలుపునిచ్చారు. ఖమ్మం రూరల్ మండలం చింతపల్లి గ్రామంలో నిర్వహించిన రైతు అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ ఈ మేరకు కీలక సూచనలు చేశారు. వ్యవసాయంలో ఎదురవుతున్న వాతావరణ సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ పంటల వైపు రైతాంగం మొగ్గుచూపాలని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ వివరించారు.