అమెరికా, ఇజ్రాయెల్‌లపై ఇరాన్ క్షిపణి హెచ్చరిక: కొత్త యుద్ధ ఆదేశాలు జారీ
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: టెహ్రాన్
అమెరికా మరియు ఇజ్రాయెల్ దేశాలకు వ్యతిరేకంగా ఇరాన్ కొత్త సైనిక వీడియోను విడుదల చేసిందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఏతరహా బెదిరింపులనైనా తక్షణమే దీటుగా ఎదుర్కొంటామని ఈ సందర్భంగా టెహ్రాన్ స్పష్టం చేసింది. సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ ఆదేశాల మేరకు సైనిక లక్ష్యాల బ్యాంకును అప్డేట్ చేస్తున్నట్లు ఫర్స్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. భవిష్యత్తులో జరిగే సంఘర్షణలు భౌగోళిక సరిహద్దులను దాటి విస్తరిస్తాయని హెచ్చరించడం అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది.