MRP కంటే ఎక్కువ వసూలు చేస్తే భారీ జరిమానా తప్పదు
రిపోర్టర్: అశోక్
స్థలం: కాకినాడ
అన్నవరం దేవస్థానం ప్రాంతంలో ఎమ్మార్పీ ధర కంటే అదనంగా రూ. 7 వసూలు చేసిన దుకాణదారుడిపై వినియోగదారుల ఫోరం సంచలన తీర్పునిచ్చింది. బాధితుడు పి. వెంకటేశ్వరరావు చేసిన ఫిర్యాదును విచారించిన కోర్టు, షాప్ యజమానికి రూ. 10 వేల కోర్టు ఖర్చులతో పాటు వినియోగదారుల సంక్షేమ నిధికి ఏకంగా రూ. 7 లక్షల జరిమానా విధించింది. నిబంధనలు ఉల్లంఘించే వ్యాపారులకు ఈ తీర్పు కనువిప్పు కానుంది.