పేద విద్యార్థినులకు ఆర్థిక సాయం అందించిన ట్రస్ట్

రిపోర్టర్: హరి స్థలం: రంగారెడ్డి

చెన్నైకి చెందిన ఫ్రెండ్స్ ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు నిరుపేద విద్యార్థినులకు ఆర్థిక సాయం అందించింది. ఈనాడు పత్రికలో వచ్చిన కథనంతో స్పందించిన ట్రస్ట్, విద్యార్థినులకు అవసరమైన సాయం ప్రకటించింది. రామోజీ ఫిల్మ్‌సిటీలో ఈనాడు సంపాదకులు ఎం.నాగేశ్వరరావు విద్యార్థినులకు చెక్కులను అందజేశారు. విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు.