కూటమి నేతల వ్యవహారం అలీబాబా నలభై దొంగలలా ఉంది అంటూ బొత్స సత్యనారాయణ విమర్శలు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: ఆంధ్రప్రదేశ్
తాను గత నలభై ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, ప్రస్తుత కూటమి నేతల వ్యవహారశైలి అచ్చం అలీబాబా నలభై దొంగల చందంగా తయారైందని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విమర్శించారు. అధికారంలో ఉన్నవారు ప్రజా సమస్యలను గాలికొదిలేసి స్వార్థం కోసం పనిచేస్తున్నారని మండిపడ్డారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలే తక్షణ లక్ష్యమని, కూటమి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.