రబీ సీజన్ కు సమగ్ర పంటల ప్రణాళిక సిద్ధం చేయాలన్న తుమ్మల
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ఖమ్మం అర్బన్
వచ్చే రబీ సీజన్ కు వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటి నుంచే పంటల ప్రణాళిక సిద్ధం చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. నాగార్జునసాగర్ నీటి లభ్యత లేకపోవడం, కాలువల ద్వారా సాగునీటి పరిస్థితి, భూగర్భ జలాల లభ్యత, విద్యుత్ సరఫరా వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని వరి సాగును తగ్గించి ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలని సూచించారు. L-నినో దృష్ట్యా ఆయిల్‌పామ్ సాగును విస్తృతంగా పెంచాలన్నారు.