నాగూర్లపల్లిలో రూరల్ బ్యాంకు ఏర్పాటు చేయాలని వినతిపత్రం

రిపోర్టర్: T.RAJASHEKAR స్థలం: నర్సంపేట

నాగూర్లపల్లిలో రూరల్ బ్యాంకు శాఖ ఏర్పాటు చేయాలని కౌన్సిలర్ నవీన్నాయక్ కోరారు. ఈ మేరకు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. నాగూర్లపల్లి చుట్టుపక్కల గ్రామాలు, తండాలకు కేంద్రంగా ఉందన్నారు. బ్యాంకింగ్ సేవల కోసం రైతులు, వృద్ధులు, మహిళలు, గిరిజనులు, కూలీలు నర్సంపేటకు వెళ్లాల్సి వస్తోందని తెలిపారు. శాఖ ఏర్పాటుతో రుణాలు, పొదుపు తదితర సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.