నెల్లూరులో దారుణం: సెల్‌ఫోన్ చోరీ ఆరోపణలతో వ్యక్తిని కొట్టి చంపిన యువకులు
రిపోర్టర్: విజయ్
స్థలం: నెల్లూరు
నెల్లూరు నగరంలో సెల్‌ఫోన్ దొంగిలించాడనే అనుమానంతో విజయ్‌కుమార్‌పై పలువురు యువకులు విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. మతిస్థిమితం కోల్పోయిన విజయ్‌కుమార్‌ను ఇంటి నుంచి ఎస్వీజీఎస్ కళాశాల వద్దకు తీసుకెళ్లి కర్రలతో కొట్టడంతో తీవ్ర గాయాలై ప్రాణాలు కోల్పోయాడని వివరించారు. మృతుడి సోదరి పద్మ ఫిర్యాదు మేరకు బాలాజీనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని, పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని పోలీసులు వెల్లడించారు.