స్పామ్ కాల్స్ కట్టడికి ట్రాయ్ కొత్త నిబంధనలు
రిపోర్టర్: మహేష్
స్థలం: India
భారత టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ ట్రాయ్ స్పామ్ కాల్స్ మరియు అవాంఛిత వాణిజ్య సందేశాలకు అడ్డుకట్ట వేసేందుకు నిబంధనలను మరింత కఠినతరం చేస్తోంది. ఇందులో భాగంగా ట్రూకాలర్ వంటి కాలర్ ఐడీ యాప్‌లు, టెలికాం ఆపరేటర్ల మధ్య సమన్వయంపై కొత్త మార్గదర్శకాలు అమల్లోకి వస్తున్నాయి. వాణిజ్య కమ్యూనికేషన్ల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఎస్ఎంఎస్ టెంప్లేట్లలో మార్పులతో పాటు వినియోగదారుల డేటా గోప్యతకు ప్రాధాన్యం ఇస్తున్నారు.