భక్తిశ్రద్ధలతో మునిగిపోయిన మనుబోలు గణనాథుని పూజా కార్యక్రమాలు

రిపోర్టర్: sankar p స్థలం: మనుబోలు

నెల్లూరు జిల్లా మనుబోలు మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ ప్రాంతంలో వినాయక చవితి వేడుకలు రెండో రోజు కూడా అత్యంత వైభవంగా కొనసాగాయి. ఉత్సవాల్లో భాగంగా విగ్నేశ్వరునికి అర్చకులు సుబ్రహ్మణ్యం శర్మ శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో స్థానిక మహిళలు, యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. పురవీధులను విద్యుత్ దీపాలతో సర్వాంగసుందరంగా అలంకరించి పండుగ వాతావరణాన్ని తీసుకువచ్చారు.