దేవి శరన్నవరాత్రుల వేడుక: ఏనుగుబయలులో వైభవంగా మూర్తపు రాట పటిష్ట
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: జి.కె.వీధి
అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం దారకొండ పంచాయతీ ఏనుగుబయలులో దేవి శరన్నవరాత్రుల సందర్భంగా మూర్తపు రాట పటిష్ట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ నెల పదకొండో తేదీ నుండి తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా నవరాత్రి ఉత్సవాలు జరగనున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ వేడుకలకు స్థానిక భక్తులు భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.