ఎస్ఎల్బీసీ టన్నెల్ తవ్వకంలో కీలక ముందడుగు: నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్

రిపోర్టర్: కిరణ్ స్థలం: శ్రీశైలం

శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ సొరంగం తవ్వకంలో కీలక ముందడుగు పడిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. టన్నెల్ పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన మాట్లాడుతూ, అత్యంత ప్రమాదకరమైన షియర్ జోన్ను విజయవంతంగా దాటినట్లు వెల్లడించారు. గత ఆరు నెలల్లో సుమారు ఏడు వందల మీటర్ల తవ్వకం పూర్తయిందని, త్వరలోనే మిగిలిన పనులను కూడా పూర్తి చేసి నిర్దేశిత లక్ష్యాలను సాధిస్తామని మంత్రి స్పష్టం చేశారు.