'మాట మార్చడమేనా పవన్ రాజకీయం?': AP Congress ఫైర్
రిపోర్టర్: నరేష్
స్థలం: Amaravati
ఎన్నికల ముందు ధరలు తగ్గిస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చాక ధరల పెరుగుదలపై మాట మార్చడం ఏంటని AP Congress (INC) తీవ్రంగా ప్రశ్నించింది. అవసరాన్ని బట్టి మాట మార్చడమే పవన్ కళ్యాణ్ రాజకీయం అంటూ నిలదీసింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఎవరి కోసమని మండిపడింది. ప్రజలను దగా చేసేలా కూటమి ప్రభుత్వ నేతల తీరు ఉందని AP Congress (INC) ఆరోపిస్తూ సోషల్ మీడియా వేదికగా ఘాటు విమర్శలు గుప్పించింది.