దసరా ప్రయాణికులకు తీపి కబురు: విజయవాడ డివిజన్ ప్రత్యేక రైళ్లు
రిపోర్టర్: విజయ్
స్థలం: విజయవాడ
దసరా పండుగ రద్దీని తగ్గించేందుకు విజయవాడ రైల్వే డివిజన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. సామాన్య ప్రయాణికుల సౌకర్యార్థం రేపటి నుంచి ఈ నెల పంతొమ్మిదో తేదీ వరకు జనసాధారణ్ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు వెల్లడించారు. ఎలాంటి ముందస్తు రిజర్వేషన్ లేకుండా నేరుగా స్టేషన్కు వెళ్లి జనరల్ టికెట్ తీసుకుని ప్రయాణించే వెసులుబాటు ఉంటుందని పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైల్వే శాఖ కోరింది.