తిరుమలలో వైభవంగా సాలకట్ల బ్రహ్మోత్సవాలు నేడు గరుడసేవ
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: తిరుమల
తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉదయం మోహినీ అవతారంలో మలయప్పస్వామి భక్తులకు దర్శనమివ్వగా, రాత్రికి అత్యంత ప్రాముఖ్యమైన గరుడవాహన సేవ జరుగనుంది. ఈ గరుడసేవకు భారీగా భక్తులు తరలివస్తుండటంతో మాడ వీధులు కిక్కిరిసిపోయాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు.