దేశ స్వాతంత్ర్య పోరాటంలో ముస్లింల పాత్ర చిరస్మరణీయం: ఇన్సాఫ్ మహాసభలో మొహమ్మద్ సలాం
రిపోర్టర్: ఆముదాల వెంకన్న
స్థలం: ఖమ్మం అర్బన్
ఖమ్మం రూరల్ పరిధిలోని ఖానాపురం హవేలీలో రఫీ అధ్యక్షతన ఇన్సాఫ్ మహాసభ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఇన్సాఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ సలాం మాట్లాడుతూ భారత స్వాతంత్ర్య పోరాటంలో ముస్లింలు కీలక పాత్ర పోషించారని స్పష్టం చేశారు. సమాజంలో మతసామరస్యాన్ని కాపాడాలని, మైనార్టీల సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. అనంతరం ఇన్సాఫ్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఎస్కే అక్రమ్, కార్యదర్శిగా ఎండీ జాకిర్, వర్కింగ్ ప్రెసిడెంట్గా యూసుఫ్, కోశాధికారిగా యాఖుబ్ పాషా నియమితులయ్యారు.