ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత: సీజేపీ నేతల నిర్బంధంపై సౌరవ్ దాస్ ఆగ్రహం

రిపోర్టర్: కృష్ణ స్థలం: New Delhi

జంతర్ మంతర్ నిరసన ప్రదర్శన నేపథ్యంలో తమ పార్టీ నేతలను అక్రమంగా నిర్బంధించడాన్ని సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ తీవ్రంగా ఖండించారు. మోదీ, అమిత్ షా ప్రభుత్వాల నిర్బంధకాండతో ప్రజల గొంతు నొక్కలేరని ఆయన స్పష్టం చేశారు. ఎన్డీయే ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తోందని, మరింత బలంతో తిరిగి వస్తామని సౌరవ్ దాస్ హెచ్చరించినట్లు అధికారులు తెలిపారు.