దేశంలో నూతన లేబర్ కోడ్స్ అమలులోకి తీసుకువచ్చిన కేంద్ర ప్రభుత్వం
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: New Delhi
దేశంలోని కార్మిక చట్టాలను సరళీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం పాత చట్టాలను ఏకీకృతం చేస్తూ నాలుగు నూతన లేబర్ కోడ్స్‌ను అమల్లోకి తెచ్చింది. వేతనాలు, పారిశ్రామిక సంబంధాలు, సామాజిక భద్రత, వృత్తిపరమైన భద్రత వంటి అంశాలను కవర్ చేస్తూ గతంలో ఉన్న 29 కేంద్ర చట్టాలను రద్దు చేస్తూ ఈ నూతన కోడ్స్‌ను అమలు చేశారు. దీనివల్ల కార్మికులకు మరింత మెరుగైన భద్రత లభించనుంది.