అనుకున్న సమానికే రణబాలి సినిమా విడుదలంటూ మైత్రీ మూవీ మేకర్స్ స్పష్టీకరణ

రిపోర్టర్: సునీల్ స్థలం: హైదరాబాద్

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా తెరకెక్కుతున్న రణబాలి సినిమా విడుదల ఆలస్యమవుతుందనే ప్రచారాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ఖండించారు. ఈ సినిమా వాయిదా పడటం లేదని, ముందుగా ప్రకటించిన విధంగా అక్టోబర్ 16వ తేదీనే ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల చేయనున్నట్లు వారు సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ హీరో విజయ్ దేవరకొండ నూతన పోస్టర్ను సైతం చిత్రబృందం విడుదల చేయడంతో అభిమానుల్లో నెలకొన్న అన్ని రకాల అనుమానాలు పూర్తిగా తొలిగిపోయాయి.